తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా 57 ఐసీఐసీఐ బ్యాంక్‌ బ్రాంచీలు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ ఐసీఐసీఐ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఈ ఏడాది కొత్తగా 57 బ్రాంచీలను అందుబాటులోకి తీసుకురానుంది. వీటిలో ఏపీలో 23, తెలంగాణలో 34 బ్యాంక్‌లు రానున్నాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త బ్యాంక్‌లతో కలిపి తెలుగు రాష్ట్రాల్లో వీటి సంఖ్య 402కి చేరుతుందని.. వీటిల్లో ఏపీలో 179, తెలంగాణలో 223, ఏటీఎంలు 1,580 ఉన్నాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 2019–20లో దేశవ్యాప్తంగా కొత్తగా 450 బ్యాంక్‌లను లక్ష్యించామని, ఇందులో 388 ఇప్పటికే ప్రారంభించామని ఐసీఐసీ ఈడీ అనూప్‌ బాగ్చీ తెలిపారు.




- రేటింగ్‌ లేని డెట్‌సెక్యూరిటీల్లో డిఫాల్ట్‌ ఎదురైతే వాటిని ప్రత్యేకమైన పోర్ట్‌ఫోలియోగా వేరు చేయాలని మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలను సెబీ ఆదేశించింది. ఇటీవలి కాలంలో పలు కార్పొరేట్‌ కంపెనీలు డెట్‌ చెల్లింపుల్లో విఫలమవుతున్న విషయం తెలిసిందే. - సమస్యాత్మక ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీలకు ఐబీసీ చట్టం కింద పరిష్కారం చూపేందుకు ఓ ప్రత్యేక విండో ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. 



 






ధర రూ. 64,900 న్యూఢిల్లీ: దేశీ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ 'హీరో మోటొకార్ప్‌'.. భారత్‌ స్టేజ్‌–6 నిబంధనలకు అనుగుణంగా ఉన్న స్ల్పెండర్‌ ఐస్మార్ట్‌ బైక్‌ను గురువారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఢిల్లీలో దీని ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ. 64,900. ఈ నూతన బైక్‌లో 110సీసీ ఫ్యూయల్ ఇంజెక్షన్ ఇంజిన్‌ను అమర్చింది. మునుపటి తరంతో పోల్చితే ఇది అధిక టార్క్‌ని, మైలేజిని ఇస్తుందని కంపెనీ వివరించింది. జైపూర్‌లోని సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్