‘బాపిరాజు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు’

అమరావతి : ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ తనకు ప్రాణ భయం ఉందని కేంద్రానికి లేఖ రాశారంటే తప్పు చేసినట్లు పరోక్షంగా ఒప్పుకున్నట్లేనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్‌ కొట్టు సత్యనారాయణ వ్యాఖ్యానించారు. గురువారం తాడేపల్లిగూడెంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కొంతమంది ప్రోద్బలంతో ఈసీ కరోనా వైరస్ కారణం చూపించి ఎన్నికలు వాయిదా వేసినా.. సుప్రీంకోర్టు న్యాయబద్దంగా ఎన్నికల కోడ్ ఎత్తివేయడం హర్షణీయమన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రజలు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి పశ్చిమ గోదావరి జిల్లా తెదేపా మాజీ జడ్పీ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని, ముఖ్యమంత్రికి  ఏ సామాజిక వర్గం నుంచి కూడా వ్యతిరేఖత లేదని స్పష్టం చేశారు. (సీఎం జగన్‌ అత్యున్నత స్థాయి సమావేశం )